![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -344 లో.. ఎక్కడ నిజం బయటపడి పెళ్లి ఆగిపోతుందోనని ముకుంద భయపడుతుంటుంది. అప్పుడే ముకుంద దగ్గరికి భవాని వచ్చి.. ఎందుకు టెన్షన్ పడుతున్నావని అడుగుతుంది. ఏం లేదు మురారికి గతం గుర్తుకు వచ్చింది. నాకు అన్యాయం జరుగుతుందేమోనని భయంగా ఉందని ముకుంద అంటుంది. భయం ఎందుకు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు కదా.. తప్పు చెయ్యనిదే జైలుకీ ఎందుకు వెళ్తాడని భవాని అనగానే.. పెళ్లి అయ్యాక ఒకవేళ కృష్ణ వాళ్ళు ఏమి తప్పు చేయలేద తెలిస్తే అని ముకుంద అంటుంది. అవన్నీ ఏమి ఆలోచించకని భవాని చెప్తుంది.
ఆ తర్వాత మీరు అన్ని చూసుకుంటారు. నాకు ఇక టెన్షన్ ఎందుకని ముకుంద వెళ్ళిపోతుంది. నేను చూసుకుంటానని ముకుంద దైర్యంగా ఉంది. నేను అనుకున్నవి ఏమి జరగట్లేదు. మురారిని అమెరికా పంపించాలి అనుకున్నా అవ్వలేదు.. కృష్ణని ఇంట్లో నుండి పంపించాలని అనుకున్నాను. ఇది అవలేదు. అన్ని కృష్ణకి ఫేవర్ గా అవుతున్నయని భవాని అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు హాస్పిటల్ కి వెళ్లి పరిమళ మేడమ్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్పి నన్ను సర్జరీ కోసం తీసుకోని వచ్చింది ఎవరని మురారి అడుగుతాడు. శేఖర్ అనే వ్యక్తి తీసుకోని వచ్చాడు. అంతే డీటెయిల్స్ ఏమి చెప్పలేదని పరిమళ చెప్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ లో చూడండని మురారి అంటాడు. కానీ సీసీ టీవీ ఫుటెజ్ ఆ ఒక్క రోజుది తప్ప మిగతా రోజులవి ఉన్నాయి. ఎవరో పక్కా ప్లాన్ తో ఇదంతా చేశారని మురారి అనుకుంటాడు. పరిమళ మేడమ్ స్టాఫ్ ని పిలిచి అడుగుతుంది. అ రోజు సీసీ టీవీ రిపేర్ లో ఉందని చెప్తాడు. కాసేపటికి మురారి, కృష్ణ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు.
మరొకవైపు పెళ్లి నగలు సెలెక్ట్ చెయ్యడానికి భవాని మేడమ్ ఇంటికి రమ్మన్నారని సేట్ నగలు ఇంటికి పట్టుకొని వస్తాడు. ఆ తర్వాత ముకుంద, భవాని ఇద్దరు నగలు సెలక్షన్ చేస్తుంటారు. అక్కడే ఉన్న రేవతిని ఎలా ఉన్నాయని అడుగగా.. బాగాలేదని చెప్తుంది. మరి నువ్వు సెలెక్ట్ చెయ్ అని భవాని అనగానే.. తనకి ఇష్టం లేకున్నా రేవతి సెలెక్ట్ చేస్తుంది. ఇక ముకుంద కూడ ఇష్టం లేకున్నా రేవతి సెలక్షన్ చేసింది కాబట్టి నచ్చిందని చెప్తుంది. కాసేపటికి శకుంతల దగ్గరికి రేవతి వస్తుంది. మురారి ఎలాగైనా మా అయన ఏం తప్పు చెయ్యలేదని నిరూపిస్తాడని శకుంతల చెప్తుంది. మరొకవైపు కృష్ణ, మురారి ఇద్దరు వెళ్లి కమీషనర్ ని కలుస్తారు. జరిగిందంతా చెప్తారు. మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతానని అనగానే రెండు నెలలు కన్పించకుండా ఉండి రూపం మారి వస్తే చాలా కాంప్లికేటెడ్ అవుతుందని కమీషనర్ అంటాడు. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |